కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేసిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని భాజపా పాలకొండ నియోజకవర్గ ఇన్ చార్జి తాండంగి సునీత డిమాండ్ చేశారు. యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ ఆదేశాల మేరకు పాలకొండలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. అగ్రవర్ణ పేదల కోసం భాజపా రిజర్వేషన్లు వర్తింపజేస్తే దానిని రాష్ట్రంలోని వైకాపా నిర్విర్యం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటున్న నాయకులు అగ్రవర్ణ పేదల విషయంలో ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి