దేశంలో మోదీ సర్కారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పలు అంశాలపై ప్రస్తావించారు. మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్న ఆయన జన్‌ధన్ యోజన పథకం వలన అనేక మంది పేద వర్గాలకు లబ్ది చేకూరిందన్నారు. కోవిడ్ సమయంలో అనేక చర్యలు చేపట్టి.. మోదీ సర్కారు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలించిదని హరిబాబు కొనియాడారు.
ఇవీ చూడండి...