కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెలుగు ప్రాంతీయ సమన్వయ కర్త నాగమణి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో.. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను అరికట్టవచ్చంటూ ర్యాలీ చేపట్టారు. జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో సంచరించవద్దని.. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
ఇదీ చదవండి: కరోనాను జయించే శక్తి మన చేతుల్లోనే!