పొనుగుటివలసలోని.. రాంబట్ల చెరువులో అక్రమంగా నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. చెరువులో అక్రమ కట్టడాలు చేపడుతున్నట్లు.. తహసీల్దార్‌కు ఫిర్యాదులు రావడంతో.. రెవెన్యూ అధికారులు, పోలీసులు.. జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు చేపట్టారు. రాంబట్ల చెరువు మొత్తం విస్తీర్ణం 15 ఎకరాల 47 సెంట్లు ఉండగా.. చాలా ప్రాంతం ఆక్రమణకు గురి అయ్యింది. చెరువు గర్భాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: Love cheating: ప్రేమన్నారు..మోసగించారు..ఒక్కరు కాదు..!