ETV Bharat / state

యువ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు ఎందుకు రావడంలేదు..? - atchannaidu on corona in ap

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ కరోనాపై పోరు చేస్తుంటే... సీఎం జగన్ మాత్రం తాడేపల్లి నుంచి బయటకు రావడంలేదని ధ్వజమెత్తారు. యువ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే నాయకుడు ప్రజల మధ్యకు ఎందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు.

atchannaidu criticize Jagan over corona control
అచ్చెన్నాయుడు ట్వీట్
author img

By

Published : Apr 21, 2020, 2:52 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో... ప్రజల్ని కాపాడుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని తెదేపా నేత కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 65 ఏళ్ల పశ్చిమ్​బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. 63 ఏళ్ల గుజరాత్ సీఎం విజయ్​రూపాని సహాయక కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటున్న విషయం ప్రస్తావించారు. అసోం ముఖ్యమంత్రి సోనోవాల్ క్షేత్రస్థాయిలో కరోనా నివారణ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్న అచ్చెన్నాయుడు... 61 ఏళ్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహన్ సైతం గ్రామాల్లో తిరుగుతూ... రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని వివరించారు. మేఘాలయా ముఖ్యమంత్రి సంగ్మా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్న విషయం గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 77 ఏళ్ల వయసున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనాపై పోరాటం చేస్తున్నారని వివరించారు. యువ ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ సీఎం... తాడేపల్లి రాజప్రసాదంలో నుంచి బయటకు రారా..? రాజకీయమే ఆయనకి ముఖ్యమా..? అని అచ్చెన్నాయుడు ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

ఇదీ చదవండీ... 'ఇకనైనా ప్రజాధనం దుర్వినియోగం చేయకండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.