రైతులపై ఉన్న బాధ్యతతో ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా మూడవ విడత పంపిణీ కార్యక్రమంలో.. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ నివాస్‌తో కలిసి సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. అర్హులైన కౌలు రైతులకు, సాగుదార్లకు ఏటా 13,500 చొప్పున.. అయిదేళ్లలో 67,500 అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 3లక్షల 34 వేల రైతు కుటుంబాలకు 450 కోట్ల 98 లక్షల ఆర్థిక సహాయంగా అందిచామన్నారు. 2020-21 సంవత్సరంలో రెండు విడతల్లో జిల్లాలోని 3 లక్షల 68 వేల రైతు కుటుంబాలకు 4 వందల 23 కోట్ల మొత్తాన్ని జమ చేశామన్నారు. 2020-21 సంవత్సరంలో మూడవ విడతగా జిల్లాలోని 3 లక్షల 81 వేల రైతు కుటుంబాలకు 85 కోట్ల 78 లక్షల మొత్తాన్ని జమ చేశామన్నారు.
ఇదీ చదవండి :