శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ... ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్-2019కు వేదిక కానుంది. శాస్త్రరంగ పరిశోధన సమకాలీన అంశాలపై చర్చలకు యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి... ముఖ్యఅతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారని వర్సిటీ ఉపకులపతి డాక్టర్.కూన రాంజీ తెలిపారు. 13 జిల్లాల నుంచి వివిధ యూనివర్సిటీల వీసీలు పాల్గొంటారని వివరించారు. 3రోజులపాటు జరిగే ఈ సదస్సులో... వివిధ రకాల ఉత్పత్తులు స్టాళ్లలో అందుబాటులో ఉంచనున్నారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళం టు జర్మనీ... వయా పుట్టపర్తి