సత్వర న్యాయానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక కోర్టులు, బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో హైకోర్టు సీజే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. న్యాయవ్యవస్థలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ చక్కని పనితీరును చూపించాలన్నారు. మహిళా, ఫొక్సో కోర్టు ప్రారంభించటం సంతోషంగా ఉందని తెలిపారు.
న్యాయవ్యవస్థ ఉన్నతంగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ భవన్కు ఎంపీ రామ్మోహన్ నాయుడు నిధుల నుంచి రూ.30లక్షలను మంజూరు చేశారు.
ఇదీ చదవండి