శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును హర్షిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ్మినేని సీతారాంను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ... ఒక క్రికెటర్గా తనవంతు బాధ్యతగా క్రికెట్ అభివృద్ధి కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో కొత్తగా రెండు క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. పులివెందుల, ఆమదాలవలసకు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని ఆయన అన్నారు. రంజీ, స్టేట్, జోనల్లో ఆడిన క్రికెటర్లు శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది ఉన్నారని చిరంజీవి అన్నారు.
ఆరు నెలల వ్యవధిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. గతంలో తమ్మినేని సీతారాం క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో... ఆయన సలహాలు, సూచనలు తీసుకుని క్రీడాకారుల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నామన్నారు. శ్రీకాకుళంలో జిల్లా క్రికెట్ అకాడమీ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయటానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి
'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'