శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో జిల్లా అదనపు వైద్యశాఖాధికారి జగన్నాథరావు పర్యటించారు. పలాస మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడితే... తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆశా వర్కర్లకు తెలిపారు.
జిల్లాలో పెరుగుతున్న కరోనా వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రజలంతా హోమ్ క్వారంటైన్లో ఉండాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే... వెంటనే దగ్గరలోని ఆశా వర్కర్లకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: