ETV Bharat / state

Sarath Babu Biography: శరత్​ బాబు ప్రస్థానం మొదలైంది అక్కడే.. స్వగ్రామంలో విషాదఛాయలు - శరత్ బాబు జీవిత చరిత్ర

Film actor Sarath Babu Biography: సినీ నటుడు శరత్ బాబు ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందడంలో ఆయన స్వగ్రామమైన ఆమదాలవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన బాల్యం అంతా ఆమదాలవలసలోనే సాగింది.. శరత్ బాబు స్నేహితులు, సన్నిహితులు ఆయన మృతి పట్లు సంతాపం తెలిపారు.

శరత్ బాబు ప్రస్థానం మొదలైంది అక్కడే.. స్వగ్రామంలో విషాదఛాయలు
Film actor Sarath Babu Biography
author img

By

Published : May 22, 2023, 7:53 PM IST

Film actor Sarath Babu Biography: సినీ నటుడు శరత్ బాబు( సత్యనారాయణ దీక్షిత్) హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్​లో ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో ఉండటంలో మొదట బెంగుళూరు ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మృతి చెందారు.

ఆమదాలవలసలో విషాదఛాయలు.. శరత్ బాబు మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఆమదాలవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్నేహితులు, సన్నిహితులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. చిన్నతనంలో వారు చేసిన పనులు, నాటకాలను గుర్తు చేసుకుంటూ.. బాధ పడ్డారు ఆయనకు నాటకాల వల్లే ఎంతో పేరు వచ్చిందని ఆయన స్నేహితులు తెలిపారు. అత్యంత సన్నిహితంగా ఉండే తమ మిత్రుడు ఇలా అకస్మికంగా మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

శరత్ బాబు కుటుంబం వివరాలు.. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబు తండ్రి బిజియ శంకర్ దీక్షిత్, తల్లి సుశీల వీరికి 13 మంది సంతానం. అందులో సత్యనారాయణ దీక్షిత్ (శరత్ బాబు) మూడో కుమారుడు. శరత్ బాబు పెద్దన్నయ్య ఉమా బాబు దీక్షితులు, రెండో అన్నయ్య రామారమణ దీక్షితులు, శరత్ బాబు తమ్ముళ్లు సంతోష్ దీక్షిత్, గోవింద దీక్షిత్, గోపాల్ దీక్షిత్, మధు దీక్షిత్, మంజు దీక్షితులు ఉన్నారు. శరత్ బాబుకు అక్కా చెల్లెలు ఐదుగురు రమ, ఆశ, అనిత, సరిత, శ్రీదేవి ఉన్నారు.

శరత్ బాబు పెద్దన్నయ్య ఉమా బాబు దీక్షితులు శ్రీకాకుళం పట్టణంలో వ్యాపారవేత్త, సంతోష్ బాబుతోనే ఉంటున్నారు, గోవిందనే అన్నదమ్ముడు చెన్నైలో ఉంటున్నారు, గోపాల్​ మధు దీక్షిత్ మంజు దీక్షితులు ఆమదాలవలసలో ఉంటున్నారు. శరత్ బాబు రెండో అన్నయ్య రమారమణ దీక్షిత్ ఇటీవల అనారోగ్యం కారణంగా ఆమదాలవలసలో మృతి చెందారు. అక్కాచెల్లెలు చెన్నై, ముంబై, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శరత్ బాబు సాంఘిక నాటకాలు ద్వారా ప్రజలకు పరిచయమయ్యారు అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించారు.

శరత్ బాబు విధ్యాభ్యాసం.. శరత్ బాబు విధ్యాభ్యాసం అంతా ఆమదాలవలసలోనే సాగింది. ఆయన లక్ష్మీ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి వరకు చదువుకున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. శ్రీకాకుళం హార్స్ కాలేజీలో డిగ్రీ వరకు పూర్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.