శ్రీకాకుళం జిల్లా రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమాచారం మేరకు తనిఖీ చేసినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అనధికారికంగా ఉన్న 70వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కంటే అదనంగా ఒక శాతం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి... నరసన్నపేటలో వైభవంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు