శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల వెలుగు కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీఎం ప్రసాదరావు కొంతకాలంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నాయకులతో కలసి ఆందోళన చేపట్టారు. అనంతరం నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఏపీఎం తీరును బాధిత మహిళలు ఎండగట్టారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బందిని కోరారు.
ఇవీ చూడండి: