పేదలకు ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన పొలాలను చదును చేసేందుకు వెళ్లిన అధికారులకు, గ్రామస్థుల మధ్య వివాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం జాడ గ్రామంలో ఏన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు గుర్తించారు. ఆయా స్థలాలను అధికారులు చదును చేసేందుకు యత్నించటంతో గ్రామానికి చెందిన మహిళా రైతు పుష్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి రాజాం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరోపక్క అధికారులు పోలీసు యంత్రాంగంతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి, ఇళ్లస్థలాల చదును చేసే కార్యక్రమం చేపట్టారు.
ఇవీ చూడండి...