ETV Bharat / state

వార్డు సభ్యుడిగా బరిలో ఉన్న వ్యక్తి.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం - శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం న్యూస్

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వార్డు సభ్యునిగా బరిలో ఉన్న వ్యక్తి మృతి చెందాడు.

a-man-was-killed-in-a-road-accident-on-the-chilakapalem-national-highway-in-srikakulam-district
ఫలితాలు రాకముందే... రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడు మృతి
author img

By

Published : Feb 21, 2021, 8:41 PM IST

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది. ఎచ్చెర్ల పంచాయతీ నాలుగో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న జరుగుళ్ల తిరుపతిరావు (30)ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుపతిరావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడితో కలసి ద్విచక్ర వాహనంపై చిలకపాలెం వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

పోటీలో ఉన్న తిరుపతిరావు.. ఫలితాలు వెలువడక ముందే మరణించగా.. అతని కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. లాఠీఛార్జ్​తో అదుపు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.