శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం బైరి వీధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని సింధూర్పూర్కి చెందిన బిట్టువీరకు.. గత ఏడాది వివాహమైంది. భార్యతో కలసి 4 నెలల క్రితం నుంచి నరసన్నపేటలో నివాసముంటున్నాడు.
లాక్డౌన్ కారణంగా ఏ పని లేక ఇంటి బాధ్యత భారంగా మారి... ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య అంటోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: