శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్తు తీగలు తగిలి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు చల్లా శ్రీనివాసరావు.. నరసన్నపేటలోని ఆదివారపేట వీధిలోని ఓ ఇంట్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్ తీగలపై అరగంట కాలం పాటు కొట్టుమిట్టాడు. అనంతరం గుర్తించిన స్థానికులు.. అతన్ని విశాఖపట్నంలో ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: ఇరు వర్గాల ఘర్షణ..20 గుడిసెలు దగ్ధం