శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిస్థాయిలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కర్ఫ్యూ విధించారు. తహాసీల్దార్ శ్రీనివాస రావు, సీఐ ప్రసాదరావు, ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అన్ని షాపులు మూయించారు. మధ్యాహ్నం 12 తర్వాత ఆమదాలవలస ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. అనవసరంగా బయటకొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. గుంతకల్లు, గుత్తిలో కనిపించని కర్ఫ్యూ... యథావిధిగా వాహనదారుల సంచారం