Veerampalli Villagers Protest for Road: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం వీరంపల్లి గ్రామస్థులు హిందూపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్నారులతో కలిసి గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామానికి గతంలో ఉన్న రోడ్డును కొందరు ఆక్రమించుకుని.. ప్లాట్లుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటంతో గ్రామానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని.. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కష్టంగా ఉందని వాపోయారు. రోడ్డు కావాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ హిందూపురంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి: