ETV Bharat / state

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజల్లో ఆశలు చిగురింపజేస్తూ.. లోకేశ్ యువగళం పాదయాత్ర

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 49వ రోజు పూర్తయ్యింది. అన్నమయ్య జిల్లా నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ కదిరి నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కదిరిలో బస చేసిన చోటు నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైన యాత్ర ముత్యాలమ్మ చెరువు మీదుగా సాగింది.

యువగళం పాదయాత్ర 49వ రోజు
యువగళం పాదయాత్ర 49వ రోజు
author img

By

Published : Mar 21, 2023, 10:04 PM IST

యువగళం పాదయాత్ర 49వ రోజు

Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 49వ రోజు పూర్తయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ముత్యాలమ్మ చెరువు వద్ద టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను పరిశీలించిన లోకేశ్.. జగన్ ప్రభుత్వం పది శాతం పనులు కూడా పూర్తిచేయలేక లబ్ధిదారులను ఇబ్బందులకు చేస్తోందని మండిపడ్డారు.

పాల్గొన్న ఎమ్మెల్సీలు, గంటా... మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పులగంపల్లి వద్ద పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్​కు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. అంగన్​వాడీ వర్కర్ల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ లోకేశ్​తో పాటు టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో పాదయాత్రలో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్సీలతోపాటు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నారా లోకేశ్​ను కలిసి కొంత దూరం పాదయాత్రలో పాల్గొన్నారు.

ప్రజలను పలకరిస్తూ... ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్లో ఆశలు చిగురింప చేస్తూ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. మూడు రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర సాగించారు. మంగళవారం ఉదయం కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మార్గమధ్యంలో ప్రజలను పలకరించుకుంటూ సాగింది. భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులతో కలిసి నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు.

హంద్రీనీవా వద్ద సెల్ఫీ... కదిరి మండలం ముత్యాలమ్మ చెరువు వద్ద టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లోకేశ్ పరిశీలించి ప్రభుత్వ వైఫల్యంగా చెప్పారు. తొంబై శాతం నిర్మాణం పూర్తిచేసిన ఇళ్లు, పదిశాతం పనులు చేయలేక జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు సొంత ఇంటి కల దూరం చేసిందని విమర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద లోకేశ్​ సెల్ఫీ తీసుకున్నారు. అక్కడినుంచి చిన్నగుట్ట తాండ వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి, టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కాలువలు, నిర్మించి ప్రజలకు నీరందించామని, ఇది వాస్తవ అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. కాలువ వద్ద సెల్ఫీ తీసుకున్నారు.

పల్లె రఘునాథ్ రెడ్డి ఘన స్వాగతం.. ముత్యాలమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభించి పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి లోకేశ్​కు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి ఆయన ఆహ్వానం పలికారు. వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం, వేద ఆశీర్వచనం ఇప్పించటంతో పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పులగంపల్లి గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడారు. అక్కడి నుంచి గొనుకువారి పల్లి విడిది కేంద్రానికి చేరిన లోకేశ్ తనతో కలిసి నడిచిన అభిమానులు, కార్యకర్తలకు సెల్ఫీలు ఇచ్చారు.

మూడు రోజుల విరామం.. సాయంత్రం గునుకువారి పల్లి విడిది కేంద్రానికి చేరుకున్న నారా లోకేశ్ ఉగాది పండుగను అక్కడే జరుపుకోనున్నారు. 22, 23, 24 తేదీలలో (మూడు రోజలు) యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చారు. విరామానంతరం తిరిగి 25వ తేదీన 50వ రోజు పాదయాత్రను గోనుకువారి పల్లి నుంచే లోకేశ్​ ప్రారంభించనున్నారు.

తనయుడికి సారీ: తనయుడు దేవాంశ్​కు నారా లోకేశ్​ సారీ చెప్పారు. యువగళం పాదయాత్రలో ఉన్నందున పుట్టినరోజు నాడు నీతో గడపలేకపోయానంటూ ట్వీట్ చేశారు. తన ఆశీసులతో పాటు యువగళంలో తనను కలిసే వేలాదిమంది ఆశీసులు ఉంటాయని, ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 'మిస్ అవుతున్నా కన్నా' అంటూ లోకేశ్​ ట్వీట్​లో పేర్కొన్నారు.

  • Dear Devaansh, sorry for not being able to make it for your birthday Nana. You have my blessings as well as the blessings of thousands of well-wishers I am meeting at #Yuvagalam. Have a wonderful day and a terrific year ahead. Miss you buddy! pic.twitter.com/2t2upA380N

    — Lokesh Nara (@naralokesh) March 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.