ETV Bharat / state

సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపు-నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు - TDP Chalo Puttaparthi Protest news

TDP 'Chalo Puttaparthi' Protest Updates: సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ నేడు 'చలో పుట్టపర్తి'కి తెలుగుదేశం పిలుపునివ్వగా.. పోలీసులు నేతలు, రైతులు, విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన నేతలు, రైతులు నల్ల బెలూన్లతో సీఎం గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

TDP_Chalo_Puttaparthi_Protest
TDP_Chalo_Puttaparthi_Protest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 1:26 PM IST

సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపు-నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

TDP 'Chalo Puttaparthi' Protest Updates: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేడు 'చలో పుట్టపర్తి'కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో చలో పుట్టపర్తికి బయలుదేరిన టీడీపీ నేతలను, రైతులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహించిన నేతలు, రైతులు నల్ల బెలూన్లతో సీఎం గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు.

Police Stopped TDP Leaders: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్..ఉమ్మడి జిల్లాలో పర్యటించడంపై రైతులు, టీడీపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటనకు వ్యతిరేకంగా 'చలో పుట్టపర్తి'కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 'చలో పుట్టపర్తి' నిరసనకు బయలుదేరిన తెలుగుదేశం నేతలను, శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రైతులను ఆదుకోలేని ఈ ప్రభుత్వమెందుకని నేతలు ప్రశ్నించారు. అన్నదాతలకు న్యాయం జరిగేవరకు తాము పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పారు.

'అనంత' కరవు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర - ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమా ప్రకటించాలని రైతుల డిమాండ్

TDP Leaders Protest With Black Balloons: సీఎం జగన్‌ పర్యటనను నిరసిస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ నాయకురాలు సవిత ఆధ్వర్యంలో సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదంటూ.. టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు.

TDP Main Leaders Arrest: మరోవైపు సీఎం జగన్‌ పర్యటనను నిరసిస్తూ.. సోమవారం 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అందులో ప్రధానంగా కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, పార్థసారథిలను అదుపులోకి తీసుకుని.. పెనుకొండ వద్దనున్న హోటల్‌లో ఉంచారు. వీరితోపాటు ప్రకాశ్‌ నాయుడిని గృహనిర్బంధం చేశారు.

Irrigated or Dry Paddy Crops in Murukondapadu: సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంట.. ఉరితాళ్లతో రైతుల నిరసన

''ఏ నేరం చేశామని మమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మా పార్టీ ముఖ్య నేతలను సోమవారం రాత్రే నిర్బంధించారు. సీఎం జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తుంగలో త్రొక్కారు. పుట్టపర్తిలో సీఎం సభను అడ్డుకునేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘ నేతలను హిందూపురంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయం.''- టీడీపీ నేతలు, ఉమ్మడి అనంతపురం జిల్లా

Amaravathi Farmers Meet Lokesh Bhuvaneswari: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెప్తాం.. నారా భువనేశ్వరి, లోకేశ్‌లతో అమరావతి రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.