No Facilities in Kothacheru BC Hostel : తాగుదాం అంటే సరైన నీటి వసతి లేదు. కడుపు నిండా తిందాం అంటే పురుగుల అన్నం. సరే వసతి ఉందంటే అది లేదు. ఒకవేళ ఉన్నా పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. రాష్ట్రంలో ఉన్న బీసీ బాలికల హాస్టల్ల పరిస్థితి ఇదే. పేద పిల్లలకు మేనమామగా చెప్పుకునే సీఎం జగన్‌కు బీసీ బాలికల హాస్టల్‌ను పూర్తి చేయించాలనే ఆలోచనే లేదు. విద్యార్థినులకు అండగా ఉన్నారంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో మాత్రం శూన్యం. మౌలిక వసతుల్లేని అద్దె భవనంలో బాలికలు అవస్థలు పడుతున్నా వారి కష్టాలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం రూ. 30 లక్షలు ఖర్చు చేసి పూరైన భవనాలను అందుబాటులోకి తెచ్చేందుకు పాలకులు ఏ మాత్రం చొరవ చూపట్లేదు.
No Warden in Govada BC Hostel: గోవాడ బీసీ హాస్టల్‌లో రాత్రివేళ కనిపించని సిబ్బంది.. జనసైనికుల అగ్రహం
BC Hostels With Limited Facilities : ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు, పాడుబడిన భవనం, పెచ్చులూడిన గోడలు ఇదీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులోని బీసీ బాలిక వసతి గృహం దుస్థితి. ఇంతేకాదు ఆరు బయటే విద్యార్థినుల చదువులు, నేలపైనే నిద్ర. 150 మంది బాలికలకు మూడంటే మూడే మరుగుదొడ్లు. ఇలా 20 ఏళ్లుగా హాస్టల్‌లో సౌకర్యాల్లేక ఆ పేద పిల్లలు అద్దె భవనంలోనే బిక్కుబిక్కుమంటున్నారు. కొత్తచెరువు మండలంలో ప్రజాప్రతినిధులంతా మహిళలే. మరో ప్రత్యేకత ఏంటంటే వారంతా అధికార పార్టీకి చెందినవారే. అయినా కూడా వారికి పేద బాలికల కష్టాలు ఏమాత్రం కనపడట్లేదు. కనీసం ఒక్కరు కూడా వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదు.
వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు...!
YCP Government Neglected BC Hostels : తెలుగుదేశం హయాంలో బీసీ బాలికల కోసం అత్యాధునిక వసతులతో భవనం నిర్మించారు. పనులు తుది దశకు చేరుకునే సమయంలో ప్రభుత్వం మారింది. దీంతో భవనానికి గ్రహణం పట్టింది. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా హాస్టల్‌ను అందుబాటులోకి తేవటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. కేవలం 30 లక్షల రూపాయలు వ్యయం చేస్తే బాలికలకు చక్కటి వసతి కల్పించే అవకాశం ఉన్నా జగన్ మామ ఏ మాత్రం శ్రద్ధ చూపట్లేదు. భవనం ఖాళీగా ఉంటడంతో అసాంఘిక శక్తులు పాగా వేశాయి. చీకటి పడిందంటే చాలు మద్యం బాటిళ్లు తెచ్చుకొని హాస్టల్ భవనాన్ని బార్‌గా మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదనుగా బిల్డింగ్‌లోని ఎలక్ట్రికల్ వస్తువులతోపాటు కిటికీలు, తలుపులను దొంగలు దోచేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు.
కొత్త భవనం కోసం 30 లక్షలు కావాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా పాలకులు కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా హాస్టల్‌ను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.