headmastear misbehavior in AP: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు.. తన స్కూల్లో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గత కొన్ని రోజులుగా ఆ ప్రధానోపాధ్యాయుడి ఆగడాలను బరిస్తూ వస్తున్న విద్యార్థులు సహనం కోల్పోయారు. ఉపాధ్యాయుడు తమ పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై విద్యార్ధినులు తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న వారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పాఠశాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై చర్యలకు ఉపక్రమించిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లా చోటుచేసుకుంది.
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం విచారణ చేపట్టిన అధికారులు సదరు ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు.. ఆ పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇదే అంశంపై ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్లో జరుగుతున్న ఘనటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడి పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశంతో జిల్లా, మండల విద్యాధికారులు, ఐసీడీఎస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాఠశాలలో విచారణ చేపట్టారు. బాలికల పట్ల ప్రధానోపాధ్యాయుడు అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వెంటనే అసభ్యంగా ప్రవర్తినంచిన సదరు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. శాఖపరమైన చర్యలతో పాటు ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారి ఫిర్యాదు మేరకు ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని తనకల్లు పోలీసులు తెలిపారు.
'ప్రధానోపాధ్యాయుడు మీద ఆరోపణలు వచ్చింది వాస్తవం. అక్కడ అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున మేము గతంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహణకోసం వెళ్తే.. వారు తమ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిపై మాకు ఫిర్యాదులు చేశారు. ఇదే విషయంపై అంతకు ముందే స్కూల్లో విద్యార్థినులు తమపై జరుగుతున్న అరాచకాలపై సీఎంఓకు సైతం ఫిర్యాదు చేశారు. పిల్లలను ఎవ్వరు ఇబ్బంది పెట్టినా.. ఎక్కడా తగ్గకుండా తమకు జరిగే అన్యాయంపై మా వద్దకు వచ్చారు.ఇలాంటి ఘటనలో పిల్లలు ముందుకు రావడం గొప్ప విషయం. '-. బానుజా, రెడ్స్ స్వచ్చంధ సంస్థ
ఇవీ చదవండి: