GADAPA GADAPA: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరనారాయణను మహిళలు నిలదీశారు. పెనుకొండ మండలం గోనిపేట, గోనిపేట తండా గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని పలువురు మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తాగునీటి బావి వద్దకు వెళ్లేందుకు దారి కూడా సరిగా లేదని వాపోయారు. వారంలో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తాగునీటి సమస్యపై వెంటనే చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దారిలో ప్రైవేటు వ్యక్తుల భూములున్నాయని.. గోనిపేట సర్పంచ్ తెదేపాకు చెందిన వ్యక్తి కావడంతో సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీవో శివశంకరప్ప, జెడ్పీటీసీ శ్రీ రాములు, ఇతర శాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: