Paritala Sunitha: జలాశయాలు నిండిన క్రమంలో సకాలంలో సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి మండలంలోని ముత్యాలంపల్లి, వెంకటాపురం గ్రామాల్లోని తన సొంత పొలంలో మంగళవారం ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలతో కలసి వరినాట్లు వేశారు. టమాటా తోటలో కాయలు తొలగించి, మలి కాపునకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లాలో పెద్ద ఎత్తున టమాటా సాగు చేశారని, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు వాటిని రోడ్లపై పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఏ పంటలు సాగుచేస్తే లాభదాయకమో వ్యవసాయ అధికారులు సూచనలు చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: