ETV Bharat / state

Food contamination: ఆహారం కలుషితమై.. అయిదుగురికి అస్వస్థత - కలుషిత ఆహారం తిని అస్వస్థత

Food was Contaminated and Five People Fell Ill: తన మనవళ్లు, మనవరాళ్లకు ఎంతో ప్రేమగా అన్నం వండింది లక్ష్మీదేవి అనే మహిళ. తిన్న కొద్ది గంటల్లోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందంటే?

Food contamination
కలుషిత ఆహారం
author img

By

Published : May 12, 2023, 11:48 AM IST

Food was Contaminated and Five People Fell Ill: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు.. అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహరం తిని.. ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..?

శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కొత్తపల్లి తాండాలో ఆహారం కలుషితమై అయిదుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో నలుగురు 9 ఏళ్ల లోపు పిల్లలే. అస్వస్థతకు గురైన అయిదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. కొత్తపల్లి తండాకు చెందిన లక్ష్మీదేవి.. మనవళ్లు, మనవరాళ్లతో కలసి అన్నం వండుకొని తిన్నారు. తిన్న కొద్ది గంటల్లోనే పిల్లలు ఒకరి తరువాత మరొకరు వాంతులు చేసుకున్నారు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అస్వస్థతకు గురైన వారిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ఆహారం కలుషితం అవడం వల్లే అస్వస్థతకు గురై ఉండొచ్చని వైద్యులు తెలిపారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

అనంతపురంలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలేడు గ్రామంలో కొద్ది రోజుల క్రితం 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన 24 గంటల వరకూ అధికారులు కనీసం పట్టించుకోలేదు.

గ్రామంలో కులాయిలో నీరు కలుషితమై రెండు వీధుల్లో 31 మంది వాంతులు, విరేచనాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సోమవారం అర్థరాత్రి అనారోగ్యం పాలైన 23 మంది గ్రామస్థులు.. మంగళవారం ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. ఇక గురువారం మరో ఏడుగురు అస్వస్థతకు గురై.. హాస్పిటల్​కి వెళ్లారు.

ఈ ఘటన జరిగిన 24 గంటల తరువాత అధికారులు వచ్చి.. కలుషిత ఆహారం తినటం వలన.. అస్వస్థకు గురయ్యారని తెలిపారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని వీధులకు మంచి నీరు అందిస్తూ.. మరి కొన్ని వీధులకు ఉప్పునీరు ఇస్తున్నారని ఆరోపించారు.

గ్రామంలో పారిశుధ్య పనులు చేయడం లేదని.. రోడ్లపై ముగురు నీరు నిల్వ ఉన్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తెలుపుతున్నారు. వైసీపీ మద్దతుతో గెలుపొందిని సర్పంచ్.. అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. అందుకే కలుషిత నీరు వలన గ్రామస్థులు అస్వస్థతకు గురైతే.. ఆహారం అంటున్నారని మండిపడ్డారు. గ్రామలో చిన్న హాటల్ నడుపుతున్న వ్యక్తిపైకి ఈ తప్పుని నెట్టే ప్రయత్నం చేశారు.

సర్పంచ్ తీరుపట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కాస్తా తీవ్రంగా మారడంతో.. హడావుడిగా గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలో మురుగునీటిని తరలించి, బ్లీచింగ్ పౌడర్ చల్లే పనులు చేశారు. గ్రామంలో ఉచితంగా మంచి నీటిని అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.