ETV Bharat / state

హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు.. ప్రెస్ క్లబ్​పై రాళ్ల దాడి

Conflicts between Hindupur ycp leaders
Conflicts between Hindupur ycp leaders
author img

By

Published : Jun 24, 2022, 5:25 PM IST

Updated : Jun 24, 2022, 8:25 PM IST

17:22 June 24

ప్రెస్ క్లబ్‌పై రాళ్లు రువ్విన ఎమ్మెల్సీ ఇక్బాల్ అనుచరులు

హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు

Conflicts between Hindupur ycp leaders: సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. వైకాపా సీనియర్‌ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ అనుచరుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్సీ ఇక్బాల్​ వర్గీయులు ప్రెస్‌క్లబ్‌ వద్ద ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఎమ్మెల్సీ అనుచరుల రౌడీయిజం, అక్రమాలు ఆపాలంటూ.. నియోజకవర్గంలోని 20 మందికి పైగా కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గీయులు ప్రెస్‌క్లబ్‌ వద్దకు దూసుకొచ్చారు.

ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా చేరుకున్న పోలీసులు ఎమ్మెల్సీ వర్గీయులను ప్రెస్‌క్లబ్‌ వద్ద నుంచి పంపించివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 24, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.