ETV Bharat / state

టెండర్లు పిలిచినా.. పనులు చేసేందుకు ఎవరు రాక.. - శ్రీ సత్యసాయి జిల్లాలో కూలిన వంతెన

The bridge collapsed : వంతెన కూలిపోయే ప్రమాదముందని అధికారులు ముందే గుర్తించారు. కానీ ఏం లాభం.. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాక.. సకాలంలో మరమ్మతులు జరగలేదు. దీంతో అనుకున్నంత పనీ అయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనం వెళ్లేలా తాత్కాలిక ఇనుప వంతెన ఏర్పాటు చేసినా.. సమస్య తీరలేదు.

bridge collapsed
వంతెన
author img

By

Published : Dec 5, 2022, 7:57 PM IST

టెండర్లు పిలిచినా.. పనులు చేసేందుకు ఎవరు రాక..

Bridge Collapsed in Sri Satyasai District : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో పోచనాపల్లి రహదారిలో పెన్నానదిపై వంతెన కూలి పది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగు నెలల క్రితమే ఈ వంతెన కూలే ప్రమాదం ఉందని ఆర్ అండ్ బీ ఇంజనీర్లు గుర్తించారు. దీనికి తక్షణ మరమ్మతులు చేయాలని టెండర్లు ఆహ్వానించగా.. ఒక్క గుత్తేదారు కూడా పనులు చేయటానికి ముందుకు రాలేదు. సకాలంలో మరమ్మతులు చేయకపోవటంతో రెండు నెలల క్రితం వంతెన కూలిపోయింది. దాదాపు నెలన్నరపాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా.. ఇరవై రోజుల క్రితం కేవలం ద్విచక్ర వాహనం వెళ్లేలా తాత్కలిక ఇనుప వంతెన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన పది గ్రామాలు, కర్ణాటకకు చెందిన 11 గ్రామాల ప్రజలు హిందూపురానికి రావటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజలే రాకపోకలు తిరిగి ప్రారంభించారు: కూలుతున్న వంతెనల మరమ్మతులు చేయించటం అధికారులకు కత్తిమీద సాములా మారింది. మూడున్నరేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఆర్ అండ్ బీ వంతెనలకు కనీసం వార్షిక నిర్వహణ పనులు కూడా చేయలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో పెన్నా, చిత్రావతి, వేదవతి నదులకు భారీ వరదలు రావటంతో బలహీనంగా ఉన్న వంతెనలు చాలా వరకు కూలిపోయాయి. దీంతో గ్రామస్థులే తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్దరించారు.

భయపడిన అధికారులు: ఇక ఆర్ అండ్ బీ రహదారులపై ఉన్న వంతెనలు కూలుతుండగా, ప్రజలు నిలదీస్తారని అధికారులు అటువైపు వెళ్లటానికే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పాత వంతెనలకు నిర్వహణ లేకపోవటం, దెబ్బతిన్న వాటిని మరమ్మతులు చేయకపోవటంతో ఏ రోజు ఏ వంతెన కూలుతుందో, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. వంతెనలు కూలిన మరికొన్ని చోట్ల అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు అటువైపు వెళ్లలేక ముఖం చాటేసి తిరుగాల్సి వస్తోంది. హిందూపురం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోని పోచానపల్లి రహదారిలో ఉన్న పెన్నానది వంతెన రెండు నెలల క్రితం పూర్తిగా కూలిపోయింది. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 20 కి పైగా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వం అనుమతి వచ్చినా.. చేసేవారు లేరే : పోచానపల్లి రహదారిలోని పెన్నా నదిపై ఉన్న ఈ వంతెన కూలే ప్రమాదం ఉందని అధికారులు ఆగస్టులో గుర్తించారు. అప్పట్లోనే వంతెన అత్యవసర మరమ్మతు పనుల కింద 80 లక్షల రూపాయల నిధులు మంజారు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరమ్మతు పనులు చేయాలని ప్రభుత్వం నుంచి అనుమతి లభించగా, మూడు సార్లు ఆన్ లైన్ టెండర్లు నిర్వహించారు. అయితే ఒక గుత్తేదారుడు కూడా పనులు చేయటానికి ముందుకు రాలేదు. అప్పటికే భారీ వాహనాలను వంతెనపై అనుమతించని అధికారులు, కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే తిరిగేవి. మరమ్మతు పనుల కోసం గుత్తేదారులను వెతుకుతున్న క్రమంలోనే అక్టోబర్​లో వంతెన పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దాదాపు ఇరవైకి పైగా గ్రామాల ప్రజలు హిందూపురానికి వెళ్లటానికి ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

స్థానికుల కష్టాలు: నెలన్నర రోజులు గడిచినా ఎలాంటి పనులు జరగకపోవడంతో.. స్థానికుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ద్విచక్ర వాహనం వెళ్లగలిగేలా తాత్కాలిక ఇనుప వంతెను నిర్మించారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లాలంటే కర్ణాటక వైపు నుంచి దాదాపు 28 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. సాధ్యమైనంత వేగంగా వంతెన నిర్మాణం చేపట్టి... తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.