అసత్య ఆరోపణలు మానుకోకపోతే తెదేపా మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్ అన్నారు. చీరాలలో, తమిళనాడులో పట్టుబడ్డ డబ్బులకు మంత్రి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్‌పై వచ్చిన ఆరోపణలను వెంకటేష్ ఖండించారు. గురువారం ఉదయం పట్టుకున్న కారులో మంత్రి కుమారుడు కూడా ఉన్నాడని కొన్ని ఛానల్స్‌లో వార్తలు వచ్చాయని.. ఆ సమయంలో ప్రమీత్ తమతో పాటే విజయవాడలో ఉన్నాడని చెప్పారు.
ఇవీ చూడండి: