ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గత మూడు దశాబ్దాలుగా సొంత భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్నిమాపక సిబ్బందికి త్వరలోనే సొంత గూడు సమకూరనుంది. స్థానిక ఉన్నత పాఠశాల పక్కనే... దాదాపు 50 లక్షల వ్యయంతో అధికారులు నూతన భవనం నిర్మిస్తున్నారు. వివిధ కారణాలతో కొంత కాలం ఆగిపోయిన భవన నిర్మాణ పనులు ఇటీవల మళ్లీ ఊపందుకున్నాయి. ఒకే చోట రెండు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి నాటికి నూతన భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు. ఈ కేంద్రం మూడు మండలాలకు సేవలందిస్తుంది.
ఇదీ చూడండి: