ప్రకాశం జిల్లా కొండపిలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. రైతు దినోత్సవానికి హాజరుకాకుండా చేశారు. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేసిన పరిస్థితుల్లో.. కల్యాణ మండపం బయటే ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి మారలేదు. వైకాపా కార్యకర్తల తీరుపై.. తెదేపా శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తే.. అడ్డుకోవడం దారుణమని ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఆగ్రహించారు. శాంతిభద్రతల సమస్య రాకూడదని పోలీసులకు చెప్పి కార్యక్రమానికి వచ్చినా.. వైకాపా కార్యకర్తలను ఖాకీలు నిలువరించలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు పోలీసులో రక్షణ కల్పించలేకపోతే ఎలా అని బాలవీరాంజనేయస్వామి నిలదీశారు.
తెదేపా ఎమ్మెల్యేను అడ్డుకున్న వైకాపా.. ఇలాగైతే ఎలాగప్పా?
అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొండపిలో రైతు దినోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేను.. వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రకాశం జిల్లా కొండపిలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. రైతు దినోత్సవానికి హాజరుకాకుండా చేశారు. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేసిన పరిస్థితుల్లో.. కల్యాణ మండపం బయటే ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి మారలేదు. వైకాపా కార్యకర్తల తీరుపై.. తెదేపా శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తే.. అడ్డుకోవడం దారుణమని ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఆగ్రహించారు. శాంతిభద్రతల సమస్య రాకూడదని పోలీసులకు చెప్పి కార్యక్రమానికి వచ్చినా.. వైకాపా కార్యకర్తలను ఖాకీలు నిలువరించలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు పోలీసులో రక్షణ కల్పించలేకపోతే ఎలా అని బాలవీరాంజనేయస్వామి నిలదీశారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ
* ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలుBody:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. పలమనేరు శాసన సభ్యుడు వెంకటే గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట పలమనేరు మండలం నక్కపల్లె గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కేకు కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పలమనేరు పట్టణం లోని గంటావూరు, ఓ ఎల్ ఎల్ పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, గంగవరం లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేసి, స్థానిక పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు. పలమనేరు పట్టణంలోని మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. అక్కడి నుంచి రంగబాబు సర్కిల్ మీదుగా జీలని సర్కిల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.Conclusion:కార్యక్రమంలో ఆయన వెంట వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491