ETV Bharat / state

నీళ్లకోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా - ప్రకాశం జిల్లా

పంచాయతి నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలెతో రోడ్డెక్కారు. నీళ్లు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కుర్చున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.

ధర్నాచేస్తున్న మహిళలు
author img

By

Published : Aug 26, 2019, 10:34 AM IST

Updated : Aug 26, 2019, 1:35 PM IST

గత 3నెలలుగా పంచాయతి నీళ్లు రావడం లేదంటూ... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ గ్రామం మహిళలు ఆందోళనకు దిగారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారని ఇప్పుడు పూర్తిగా రావడం లేదని అన్నారు. సాగర్​పైప్​లైన్​ నుంచి నీరు వస్తున్నప్పటికీ అవి మురికిగా ఉన్నాయని తెలిపారు. విసుగు చెందిన మహిళలు రహదారిపై ఆందోళన చేపట్టారు. రాకపోకలకు ఆగిపోయేసరికి పోలీసులు రంగంలోకి దిగి పంచాయతి, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులతో చరవాణీలో మాట్లాడారు. నీరు సరఫరాకు హామీ ఇచ్చి మహిళలతో ధర్నా విరమింపజేశారు.

ధర్నాచేస్తున్న మహిళలు

గత 3నెలలుగా పంచాయతి నీళ్లు రావడం లేదంటూ... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ గ్రామం మహిళలు ఆందోళనకు దిగారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారని ఇప్పుడు పూర్తిగా రావడం లేదని అన్నారు. సాగర్​పైప్​లైన్​ నుంచి నీరు వస్తున్నప్పటికీ అవి మురికిగా ఉన్నాయని తెలిపారు. విసుగు చెందిన మహిళలు రహదారిపై ఆందోళన చేపట్టారు. రాకపోకలకు ఆగిపోయేసరికి పోలీసులు రంగంలోకి దిగి పంచాయతి, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులతో చరవాణీలో మాట్లాడారు. నీరు సరఫరాకు హామీ ఇచ్చి మహిళలతో ధర్నా విరమింపజేశారు.

ధర్నాచేస్తున్న మహిళలు

ఇదీ చూడండి

ఆకట్టుకుంటున్న లంబోదరుడి విగ్రహాలు!

Intro: AP_SKLM_26_21_aarabindoo_kaarmikulu_dharna_av_AP10139
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల పైడిబీమావరం అరబిందో యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే సమ్మె తప్పదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు యాజమాన్యాన్ని హెచ్చరించారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పైడిభీమవరం యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ "యాజమాన్యానికి సిరి-కార్మికులకు ఉరి" తో వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరబిందో యాజమాన్యం గత 16నెలలు గా చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తోందని వివరించారు. అరబిందో యాజమాన్యం కోట్లాది రూపాయలు లాభాలు అర్జించినా కార్మికులకు వేతనాలు పెంచకుండా దుర్మార్గంగా వ్యవరిస్తుందని విమర్శించారు. అరబిందో యాజమాన్యం ఏకపక్షంగా ఎటువంటి విచారణ చేయకుండా వందలాది మంది కార్మికులను అన్యాయంగా తొలగిస్తుందని విమర్శించారు. ఇటీవల అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జె. శ్యామలరావును ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా నిలుపుదల చేసిందని ఆరోపించారు. నిలుపుదల చేసిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గత 16సంవత్సరాలుగా శాశ్వత స్వభావం గల పనులలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.అరబిందో యజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల జరిగిన ప్రమాదంలో బి.రాజారావు, బి.రాహుల్ మృతి చెందారని, పెన్సిల్లిన్ ప్లాంటు లో అల్లంపల్లి శివ గాయపడ్డారని విమర్శించారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న కార్మికుల భద్రతను యాజమాన్యం పట్టించుకోడంలేదని విమర్శించారు. యాజమాన్యం పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. పవర్ ప్లాంట్,క్యాంటీన్ కార్మికులపై యజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు‌. కార్మికులకు బస్ సౌకర్యం లేకపోవడంతో కార్మికులు రోడ్డు ప్రమాదాలకుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. కార్మికులందరికి బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరబిందో యాజమాన్యం కార్మికులను బానిసలుగా పనిచేయించడం కోసం యూనియన్ లేకుండా చేయాలని కుట్రలకు పాల్పడుతుందని కార్మికులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అరబిందో పరిశ్రమ వద్ద 144 సెక్షన్, సెక్షన్ 30ని పెట్టి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.తక్షణమే 144 సెక్టన్,సెక్టన్-30ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గురునాయుడు తదితరులు పాల్గొన్నారు.Body:M.LatchumuNaidu
Kit no 817
Srikakulam jilla
Echerala, Niyojakavargam.
9985843891Conclusion:కార్మికుల ధర్నా
Last Updated : Aug 26, 2019, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.