మట్టి పెళ్లలు మీదపడి ఓ మహిళ మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం సింగన్న పాలెంలో జరిగింది. తాళ్లూరు మండలంలోని నాగంబోట్లపాలేనికి చెందిన కొందరు కూలీలు స్థానిక వాగులో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతుండగా పెళ్లలు కూలాయి. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన లక్ష్మిని చికిత్స కోసం లక్ష్మిని చీమకుర్తికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి. కరోనా పరీక్షల ప్రత్యేక డ్రైవ్లో 500మందికి పాజిటీవ్