..
మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన
జనావాసాల మధ్య ఏర్పాటుచేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని ప్రకాశంజిల్లా వేటపాలెంలో స్థానికులు ఆందోళన చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ మద్యం దుకాణాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ మద్యం దుకాణం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. జనావాసాలు, పాఠశాల, కళాశాలలున్నాయని చెప్పినా వినకుండా.. యజమానులు ఇక్కడ దుకాణం నడుపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వేటపాలెం ఎస్సై అజయ్ బాబు వారితో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హమీ ఇవ్వడంతో..వారు ఆందోళన విరమించారు.
మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన
..
ఇదీచూడండి. 20న సీఎం పర్యటన, ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష