ETV Bharat / state

WIFE PROTEST: న్యాయం చేయాలంటూ.. అత్తింటి ఎదుట మహిళ ఆందోళన!

ప్రకాశం జిల్లా కొత్తపేటలో భర్త, అత్తమామ తనను మోసం చేశారంటూ ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్తే.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. ఎలాగైనా సరే తనకూ, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

wife-protest-infront-of-husbands-house-in-prakasham-district
న్యాయం చేయాలంటూ.. అత్తింటి ఎదుట మహిళ ఆందోళన!
author img

By

Published : Dec 15, 2021, 1:54 PM IST

న్యాయం చేయాలంటూ.. అత్తింటి ఎదుట మహిళ ఆందోళన!

ప్రేమించానంటూ వెంటపడ్డాడు. వద్దని వారించినా వినకుండా పెళ్లంటూ చేసుకుంటే నిన్నేనంటూ మాయమాటలు చెప్పాడు. తల్లిదండ్రుల గురించి ఆలోచించిన ఆ యువతి.. అతనికి దూరంగా ఉండేందుకు చాలా ప్రయత్నించింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా రోజుల తరబడి ఆమెను వేధించసాగాడు. తన ప్రేమను కాదంటే చచ్చిపోతానని బెదిరించాడు. తనని అంతలా ప్రేమించే ఓ వ్యక్తి తన కోసం చనిపోతాడేమోనని భయపడిన ఆమె.. అతని ప్రేమను అంగీకరించింది. కలిసి తిరగడాలు అవీ చేయకుండా పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించింది. ఒప్పుకున్న ఆ యువకుడు ఆమెను తీసుకొని పారిపోయాడు. ఇరువురి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారికి ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగిపోయింది కాబట్టి.. అంగీకరించారు.

పెళ్లి తర్వాత వారి జీవితం హాయిగా కొనసాగింది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. మూడేళ్ల క్రితం అతడు మరో పెళ్లి చేసుకున్నాడని గుర్తించింది ఆ యువతి. ఇక అప్పటినుంచి వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. అప్పటివరకు ఆమెపై చేయి చేసుకోని అతడు.. ఆమెను కొట్టడం ప్రారంభించాడు. వేధింపులు తట్టులేక పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది ఆ మహిళ.

తాజాగా తన స్థానంలోకి మరో మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడన్న వార్త ఆమె చెవిని తాకింది. ఇక వెంటనే తల్లిదండ్రులు, పెద్ద మనుషులతో సహా మెట్టినింటికి చేరుకుంది. 19 ఏళ్ల పాటు తనతో కాపురం చేసిన భర్త.. మరో పెళ్లి చేసుకొని ఆమెను తన అత్తింట్లో ఉంచడం.. ఇందుకు అత్తింటి వారంతా వత్తాసు పలకడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. భర్త కాలర్ పట్టుకొని నిలదీసింది. తన స్థానంలోకి వచ్చిన మరో మహిళను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. తన పిల్లలు అనాథలైపోయారంటూ ఆ ఇంటి వాకిట్లోనే కూర్చొని గుండెలవిసేలా రోదించింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడినుంచి కదిలేది లేదంటూ ఆందోళనకు దిగింది.

అసలెక్కడ జరిగిందీ ఘటన?

ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో ఈ ఘటన జరిగింది. ఈపురుపాలెంకు చెందిన విజయశాంతి, రాజేంద్రకుమార్​లు 19 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. రాజేంద్రకుమార్ వైజాగ్​లో చరవాణి మెకానిక్​గా పని చేసేవాడు. భార్య పిల్లలు కూడా అక్కడే అతనితో కలిసుండేవారు. మూడేళ్ల క్రితం భర్త మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు విజయశాంతికి తెలిసింది. నిలదీసి అడగ్గా.. అవునని చెప్తూనే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది.

ఇటీవలే తన భర్త రాజేంద్ర కుమార్.. ఆ మహిళన తీసుకొని తన అత్తింటికి మకాం మార్చినట్లు తెలుసుకుంది. వెంటనే పెద్దలు, తల్లిదండ్రులతో అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగింది. భర్త, అత్తమామలను నిలదీసింది. ప్రజాసంఘాల నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి:

man structed into lift: అపార్ట్​మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని యువకుడి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.