ETV Bharat / state

WIFE KILLED HUSBAND: కూల్​డ్రింక్​లో ఎలుకల మందు కలిపి.. - ప్రకాశం జిల్లా ప్రధాన వార్తలు

సమాజంలో రోజురోజుకు బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండాపోతోంది. జీవితాంతం కలిసి ఉంటామని వివాహ సమయంలో కొత్త దంపతులు చేసిన ప్రమాణాలకు తిలోధకాలిస్తున్నారు. వారి వారి సుఖాల కోసం కడ వరకు కొనసాగించాల్సిన బంధాలనే చిదిమేసుకుంటున్నారు. ప్రాణాలు తీస్తే కటకటాల పాలు కావాల్సిందేనన్న విషయాన్ని మరిచి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చక్కగా కాపురం చేసుకోవాల్సిన వారు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ... చివరకు ఆ సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తనే భార్య అంతమొందించిన ఘటన ప్రకాశం జిల్లా పంగులూరు మండలంలో జరిగింది.

భర్తను హత్య చేసిన భార్య
భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : Jun 20, 2021, 8:32 PM IST

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే...కడతేర్చిన ఘటన పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తూర్పుకొప్పెరపాడుకు చెందిన కుంచాల రవి(35)కి అదే గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మితో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మృతుడు రవి బేల్దారి పని చేస్తూ ఉంటాడు. మద్యానికి బానిసైన అతను భార్యపై అనుమానంతో రోజు మద్యం సేవించి ఆమెతో గొడవపడేవాడు. ఎప్పటిలాగే మంగళవారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్తతో..రాజ్యలక్ష్మి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శీతలపానీయంలో ఎలుకల మందు కలిపి తాగించింది. అది సేవించిన రవి మృతి చెందాడు.

బందువులకు ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి..తన భర్త నిద్రలోనే మృతి చెందినట్లుగా నమ్మబలికింది. విషయం తెలుసుకున్న బంధువులు దూరప్రాంతం నుంచి వచ్చేసరికి గురువారం అయింది. మృతదేహాన్ని బంధువులు పరిశీలించగా మృతుడి శరీరం నల్లగా మారింది. అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బారావు, ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానంతో భార్యను ప్రశ్నించగా తానే చంపినట్టు రాజ్యలక్ష్మి ఒప్పుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.