ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురానికి చెందిన అనపర్తి నాగేశ్వరరావు, రమాదేవి భార్యాభర్తలు. నాగేశ్వరరావు పనులు నిమిత్తం తిరుపతిలో ఉండేవాడు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో సొంత ఊరికి వచ్చాడు. తన భర్త వ్యసనాలకు బానిసై... వచ్చినప్పటి నుంచి గొడవ పడుతూనే ఉన్నాడని రమాదేవి ఆవేదన చెందింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. రోజూ మాదిరిగానే ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
మనస్థాపానికి గురైన భార్య ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు తాను కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. పిల్లలు కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికి రమాదేవి ఉరికి వేలాడుతూ ఉంది. నాగేశ్వరరావు గొంతు తెగిపడి ఉండటం గమనించి హుటాహుటిన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబంధించిన వారు ఎవరైన వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: