ప్రకాశం జిల్లాలోని ఏకైక నగర పాలక సంస్థ అయిన ఒంగోలులో వేసవి వచ్చిందంటే.. తాగునీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి. ఏటా ఎదురయ్యే సమస్యే అయినా...శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. నగరంలో 90వేల గృహాలు ఉండగా... 3లక్షల జనాభాకు తాగునీరు అందించాల్సి ఉంది. నాగార్జున సాగర్ నుంచి నీటిని... ప్రతి రోజు అందివ్వాల్సి ఉండగా... 3 రోజులకు ఒకసారి ఇస్తున్నారని స్థానికులు అంటున్నారు.
నీటి సమస్య పరిష్కారం కోసం... గత ప్రభుత్వం ప్రారంభించిన అదనపు తాగునీటి పథకం, అమృత్ పథకంలో 120కోట్లు రూపాయలతో చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇది పూర్తయితే గుండ్లకమ్మ నుంచి నగర వాసులకు సమృద్ధిగా తాగునీరు అందించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం... ఈ పథకం ఊసే ఎత్తడం లేదని స్థానికులు అంటున్నారు. సాధారణంగా ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల లోపు మాత్రమే నీరు సరఫరా చేయాలి. కానీ ఏ అర్థరాత్రో నీళ్లు వదులుతున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిద్రమానుకుని మరీ నీళ్ల కోసం జాగారం చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
"సాధారణంగా ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల లోపు మాత్రమే నీరు సరఫరా చేయాలి. కానీ ఏ అర్థరాత్రో నీళ్లు వదులుతున్నారు. నిద్రమానుకుని మరీ నీళ్ల కోసం జాగారం చేయాల్సి వస్తోంది. రాత్రంతా నీళ్ల కోసం నిద్రపోకుండా ఉండి... ఉదయం పనులకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోంది."- స్థానికులు
నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు.. రెండు చెరువులు ఆధారం. ఈ రెండు చెరువులకు నాగార్జున సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే.. నీరు సమృద్ధిగా ఉండి పంపిణీకి వీలుండేది. ప్రస్తుతం అరకొరగా ఉన్న నీటినే.. 14 ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపిణీ చేస్తున్నారు. మరో 10 ట్యాంకులు అవసరం ఉన్నా.. ఆ దిశగా పాలకులు ప్రయత్నించడం లేదని స్థానికులు అంటున్నారు. పీర్లమాన్యంలో నిర్మించిన ట్యాంకుకు.... కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల వృథాగా ఉంటోంది. ముక్తినూతలపాడులో 7 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకుకి.. గుండ్లకమ్మ నుంచి ఇవ్వాల్సిన పైపు లైను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సాగర్ ద్వారా చెరువులకు నీరు తెస్తే.. తమ నీటి కష్టాలు తీరుతాయని.. కానీ నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంపై చొరవచూపడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
"ప్రస్తుతం అరకొరగా ఉన్న నీటినే... 14 ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపిణీ చేస్తున్నారు. మరో 10 ట్యాంకులు అవసరం ఉన్నా.. ఆ దిశగా పాలకులు ప్రయత్నించడం లేదు. ముక్తినూతలపాడులో 7 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకుకి.. గుండ్లకమ్మ నుంచి ఇవ్వాల్సిన పైపు లైను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సాగర్ ద్వారా చెరువులకు నీరు తెస్తే నీటి కష్టాలు తీరుతాయి. కానీ నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంపై చొరవచూపడం లేదు."- స్థానికులు
ఇవీ చదవండి: