ETV Bharat / state

భవనం పైనుంచి పడి.. వార్డు వాలంటీర్ మృతి! - భవనం పైనుంచి పడి వార్డు వాలంటీర్ మృతి

ప్రకాశం జిల్లా అద్దంకిలో.. 5 అంతస్తుల భవనంపైనుంచి పడి వార్డు వాలంటీర్ షేక్ షాజహాన్ చనిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ward Volunteer suspected death
author img

By

Published : Nov 13, 2019, 7:21 PM IST

భవనం పైనుంచి పడి.. వార్డు వాలంటీర్ మృతి

ప్రకాశం జిల్లా అద్దంకిలో వార్డు వాలంటీర్ అనుమానాస్పదంగా చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 అంతస్తులు ఉన్న వీఎన్ఎస్ టవర్స్​పై నుంచి కిందపడి.. షేక్ షాజహాన్ అనే వ్యక్తి మరణించాడు. ఇతను పట్టణంలోని 17వ వార్డు వాలంటీర్​గా పని చేశాడు. నాలుగో వార్డు పరిధిలోని ఈ భవనంలో.. షాజహాన్ ఇలా చనిపోయి ఉండడంపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ ఇదే భవనం వద్ద ఇలాగే ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. షాజహాన్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Intro:ap_ong_62_13_valanter_anumanaspadha_mruthi_av_vo_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

-------------------------------------------------------------

( NOTE : రెడీ టు పబ్లిష్ అను పద్ధతిలో ఫైల్ పంపించడం జరిగింది పరిశీలించగలరు...)

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని వి.ఎన్.ఎస్ మల్టీ టవర్స్ (5 అంతస్థుల బిల్డింగ్ ) పై అంతస్తు నుండి కింద పడి యువకుడు మృతి చెందాడు మృతుడు పట్టణంలోని 17వ వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న షేక్ షాజహాన్ గా గుర్తించారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు 17వ వార్డు వాలంటీర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఘటన నాలుగో వార్డ్ లోనే బిల్డింగ్ వద్ద చోటు చేసుకోవడంపై పలు సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అసలు యువకుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. ఒంటిపై బట్టలు ఎందుకు చినిగిపోయి ఉన్నాయి. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా... లేదా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడా.. అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

గతంలో కూడా ఈ భవనం వద్ద ఇద్దరు మృత్యువాత పడ్డారు. నేడు ఈ ఘటన జరగడంతో భవనం లో నివాసం ఉంటున్న వారు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వాలంటీర్ షేక్ షాజహాన్ మృతదేహాన్ని పంచనామాకు
అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.