ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం పెద అలవలపాడు గ్రామ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గ్రామానికి చెందిన గూడూరి స్టీఫెన్ అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం జారీ కోసం వీఆర్వో కంచర్ల వెంకట శివ కాశయ్యను కలిశారు. ఈ క్రమంలో డబ్బు డిమాండ్ చేసినట్లు బాధిత రైతు తెలిపారు. లంచం ఇవ్వలేని స్థితిలో ఉన్న స్టీఫెన్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిఘా పెట్టిన ఏసీబీ ఆధికారులు... గ్రామ సచివాలయం వద్ద రూ. 8వేలు లంచం తీసుకుంటున్న కాశయ్యను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి సూర్య నారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడిని నెల్లూరు అవినీతి నిరోధక శాఖ జైల్‌కు తరలిస్తున్నట్లు అధికారి వివరించారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ప్రకాశం జిల్లా పెద అలవలపాడు గ్రామ రెవెన్యూ అధికారి లంచ తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. రూ. 8వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారి సూర్య నారాయణ రెడ్డి తెలిపారు.