ETV Bharat / state

రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి : దర్శి పోలీస్ స్టేషన్​లో ఎస్​ఐ నుంచి రైటర్​కు

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. అత్యవసర సేవలందించే సిబ్బంది, అధికారులకు కొవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ కి వైరస్ నిర్ధరణ అయింది. కాగా.. ఎస్.ఐ నుంచి రైటర్​కు సోకడం ఆందోళన కలిగిస్తోంది.

author img

By

Published : Jun 18, 2020, 6:13 PM IST

Virus Upgradation in the State: corona transformed from  SI to Writer at Darshi Police Station prakasham district
రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి : దర్శి పోలీస్ స్టేషన్​లో ఎస్​ఐ నుంచి రైటర్​కు

ప్రకాశం జిల్లా దర్శి పోలీసు స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ కి కొవిడ్ నిర్ధరణ అయింది. ఫలితంగా దర్శి స్టేషన్​లో పనిచేసే సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో స్టేషన్ రైటర్​కి వైరస్ సోకినట్లు నిర్ధారించి ఒంగోలు ఐసోలేషన్​కు తరలించారు. వీరితో కలిపి పట్టణంలో మొత్తం ఐదుగురికి కరోనా మహమ్మారి సోకింది. వీరిలో అయిదేళ్ల బాలిక ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

లాక్​డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా మరింత ఉద్ధృతంగా విస్తరిస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దర్శి పోలీస్ స్టేషన్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫిర్యాదు దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీచదవండి.

ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ... ఈ నెల 25కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.