ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం చెన్నంపల్లి గ్రామంలో గోమాతకు గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. 2004లో ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా గ్రామానికి చెందిన గుంటుపల్లి కోటేశ్వరరావు శివాలయానికి గోమాతను అందించారు. నాటి నుంచి నేటి వరకు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గోమాతను పూజించే వారు.
ఆ గోమాత అనారోగ్యంతో నిన్న మృతి చెందింది. ఈ మేరకు గోవుకు ఆలయం వద్ద పూజల అనంతరం మేళతాళాలతో ట్రాక్టర్‌పై గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: