ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలుగు కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. వెలుగు సీసీ నాగేశ్వరరావు కార్యాలయంలోని కిటికికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కారణాలు.. లేక ఆరోగ్య సమస్యలతోనే ఉరేసుకుని ఉంటాడనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు. నాగేశ్వరరావుతో పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆరోగ్య సమస్యతోనే ఉరి వేసుకొని ఉంటాడని చెబుతున్నారు. అసలు విషయంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి