ETV Bharat / state

పునరావాసానికి అడుగులు.. రూ. 5.55 లక్షల అంచనాతో ఇంటి నమూనా

author img

By

Published : Jul 20, 2020, 7:42 PM IST

మూడు జిల్లాల రైతులు, ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. పనులు వేగవంతం చేసింది. ప్రాజెక్టు పురోగతిలో ప్రధాన సమస్యగా ఉన్న పునరావాసానికి ఇటీవల రూ. 1301 కోట్లు కేటాయించగా- ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు.

veligonda project rehabilitation houses in prakasam district
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసానికి అడుగులు

వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లోని వారు పునరావాసం కావాలని కోరుకునే వారికి కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ విభాగంలో అయిదు సెంట్ల స్థలం, అందులో ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. దాంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ కింద రూ. 6.36 లక్షలు (ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు అదనం) ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వన్‌ టైం సెటిల్మెంట్‌ కావాలనే వారికి ఒకేసారి రూ.12.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ముంపు గ్రామాలివే...

పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, కాటమరాజుతండా, చింతలముడిపి; మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువుతండా, అర్థవీడు మండలంలోని కృష్ణానగర్‌, సాయినగర్‌, రామలింగేశ్వరపురం, లక్ష్మీపురం గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఈ గ్రామాల పరిధిలో 2006లో చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం మొత్తం 4,565 కుటుంబాలను నిర్వాసితుల జాబితాలో చేర్చారు.

ఇటీవల ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆ విషయాన్ని వెల్లడించారు. 2019 అక్టోబరు నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. 2019 సర్వే ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు 2,990 మందిని ఆర్‌అండ్‌ఆర్‌లో అర్హులుగా చేర్చారు. నాటి సర్వే సమయంలో వలస వెళ్లి ప్యాకేజీ జాబితాలో పేర్లు లేని వారిని చేర్చేందుకు ప్రస్తుతం ఆయా గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

రెండింటిలో ఏదో ఒకటి...

గత నెల రోజులుగా ముంపు గ్రామాల నిర్వాసితులతో ఒప్పంద పత్రాలపై సంతకాల సేకరణ జరుగుతోంది. 7,555 మంది నిర్వాసిత కుటుంబాల్లో పునరావాసం, వన్‌ టైం సెటిల్మెంట్‌ కావాల్సిన వారు సంతకాలు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 3,100 మంది పునరావాసం, మిగిలినవారు వన్‌టైం సెటిల్మెంట్‌ కావాలని సంతకాలు చేశారు. దీంతో అధికారులు 3,100 మందికి ఇళ్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచే యోచనలో ఉన్నారు.

3,100 ఇళ్ల నిర్మాణం...

ప్రాజెక్టు పరిధిలోని 11 గ్రామాలకు మొత్తం 3,100 ఇళ్లు నిర్మించేందుకు ఇప్పటికే జిల్లా అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. పునరావస కాలనీలో ఒక్కో ఇంటిని రూ. 2.84 లక్షలతో నిర్మించేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది. నిర్మాణ బాధ్యతను జిల్లా గృహ నిర్మాణశాఖకు అప్పగించారు. బాధితుల విన్నపం మేరకు అన్ని వసతులతో మొత్తం 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. వంటగది, పడక గది, హాలు, వరండాతోపాటు, వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా డిజైన్‌ చేశారు.

తాజా అంచనాల ప్రకారం ఒక్కో ఇంటికి రూ. 5.55 లక్షల చొప్పున అవసరమవుతాయని గృహనిర్మాణ శాఖ అంచనా వేయగా- ప్రభుత్వ జీవో ప్రకారం ఆ మొత్తం రూ. 2.84 లక్షలు మాత్రమే ఉంది. దాంతో మిగిలిన రూ. 2.71 లక్షలను గ్రేస్‌ మొత్తం నుంచి ఖర్చు చేసేలా ప్రణాళిక తయారు చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కసరత్తు పూర్తయ్యాక గృహ నిర్మాణానికి సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలువనుంది. అందుకు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.

అందరూ సంతృప్తి చెందేలా...

నిర్వాసితులందరూ సంతృప్తి చెందేలా ఇంటి నిర్మాణం చేపట్టాలన్న లక్ష్యంతో కలెక్టర్‌ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇటీవల వారితో మాట్లాడారు. అన్ని వసతులు ఉండేలా గృహ నిర్మాణశాఖ అధికారులతో డిజైన్‌ చేయించాం. అందుకు రూ.5.55 లక్షల వ్యయంతో అంచనా రూపొందించారు. ప్రభుత్వం ఇవ్వనున్న రూ. 2.84 లక్షలతో పాటు, గ్రేస్‌ మొత్తాన్ని కలిపి ప్రభుత్వం తరఫున ఇళ్లు నిర్మించనున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నాం. ఆ తర్వాత ప్రభుత్వమే టెండర్లు పిలువనుంది. - గంగాధర్‌గౌడ్‌, భూ సేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌

-

ఇవీ చదవండి:

మత్స్యకారుల వలకు చిక్కిన భారీ సొర చేప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.