ETV Bharat / state

"సీఎంవో ముట్టడి"కి యూటీఎఫ్ పిలుపు... భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు - యూటీఎఫ్ తలపెట్టిన సీఎంవో ముట్టడి వార్తలు

సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ యూటీఎఫ్ తలపెట్టిన “సీఎంవో ముట్టడి" కార్యక్రమం, పోరుగర్జన సభ భగ్నం చేసేందుకు... పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడంతో... అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. టీచర్లెవరూ నిరసనలో పాల్గొనకుండా గృహనిర్బంధాలు, అరెస్టులతో ఉక్కుపాదం మోపారు. సీఎం క్యాంప్ కార్యాలయం చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేసి... భారీ బందోబస్తు మోహరించారు.

CHALO CMO
CHALO CMO
author img

By

Published : Apr 25, 2022, 5:54 AM IST

"సీఎంవో ముట్టడి"కి యూటీఎఫ్ పిలుపు... భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు

యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన సీఎంవో ముట్టడి, పోరుగర్జన సభను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఏం చేసేనా నిరసన కార్యక్రమం విజయవంతం కాకుండా... ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం రాత్రి నుంచే ఉపాధ్యాయ సంఘాల నాయకుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు... వారిని ముందస్తుగానే గృహనిర్బంధాలు చేశారు. ఏదో రకంగా విజయవాడకు వెళ్లాలని ప్రయత్నించినవారినీ... గుర్తించి స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లకుండా ఆదివారం ఉదయం నుంచే పోలీసులు... చర్యలు చేపట్టారు. నోటీసులిచ్చి... నేతలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు... సభకు హాజరు కాకుండా వారి నుంచి సంతకాలు సేకరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఒంగోలు, మార్టూరు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ మల్లికా గార్గ్‌.. పోలీస్‌స్టేషన్‌, బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించి.. పరిస్థితిని పర్యవేక్షించారు. బాపట్ల జిల్లా చీరాలలోని అద్దంకి సర్కిల్ పరిధిలో పలువురు నాయకులు, ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి... స్టేషన్లకు తరలించారు. పోలీస్ చర్యలను నిరసిస్తూ.. ఉపాధ్యాయులు స్టేషన్‌ ముందు బైఠాయించారు.

విస్తృత తనిఖీలు: సీపీఎస్ రద్దు డిమాండ్‌తో సీఎంవో ముట్టడికి వెళ్తున్న సత్యసాయి జిల్లా మడకశిరకు చెందిన ఉపాధ్యాయులను.. పోలీసులు అడ్డుకున్నారు. వారికి నోటీసులు అందించి స్టేషన్‌కు తరలించారు. షరతులతో కూడిన పత్రంపై సంతకాలు చేయించి... గృహనిర్బంధంలో ఉండాలని హెచ్చరిస్తూ వెనక్కి పంపారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే జంక్షన్‌లో.. విజయవాడకు వెళ్లే పలు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతల ఇళ్లపై నిఘాపెట్టి... వారి కదలికలపై నిఘా పెట్టారు.

నేతల గృహనిర్బంధం: యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు తిరుపతిలో నివాసముంటున్నట్లు గుర్తించిన అధికారులు... శనివారం రాత్రి నుంచి వారి కదలికలపై నిఘా పెట్టారు. యూటీఎఫ్ కీలక నేతలతో పాటు.. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డినీ గృహనిర్బంధం శనివారం రాత్రి నుంచే గృహనిర్బంధం చేశారు. ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీసులు కాపలాకాస్తూ... అడుగు బయటపెట్టనివ్వలేదు. పుత్తూరు, శ్రీకాళహస్తి, యర్రావారిపాలెంలో ఉన్న రాష్ట్రస్థాయి, జిల్లా నాయకులనూ ఇళ్లకే పరిమితం చేశారు. న్యాయమైన తమ పోరాటాన్ని అడ్డుకోవడంపై యూటీఎఫ్ నేతలు మండిపడుతున్నారు.

అనుమతి లేదంటున్న పోలీసులు: ఛలో సీఎంవోకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ గుంటూరు పిరంగిపురం, మేడికొండూరు మండలంలోని ఉపాధ్యాయ సంఘం నేతలకు... ఆదివారం పోలీసులు నోటీసులిచ్చారు. వివిధ మార్గాల్లో విజయవాడకు వెళ్తున్న.... నెల్లూరుకు చెందిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. కందుకూరుకు చెందిన 17 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో.. యూటీఎఫ్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లో మకాం వేసిన పోలీసులు... విజయవాడ వెళ్లే రైళ్లను జల్లెడ పట్టారు. రైల్వేస్టేషన్‌లో పలువురిని విచారించి.. నలుగురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో మరో 14 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.

650 మంది పోలీసులతో బందోబస్తు: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలువునివ్వడంతో... పోలీసులు ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముందస్తుగా 650 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు మోహరించి వాహనాలను క్షణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని మార్గాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి... పర్యవేక్షిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వైపు... కిందకు ఎవరూ దిగకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధికి వెళ్లే ముందే తనిఖీలు చేస్తూ... అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారు.
ఇదీ చదవండి: యూటీఎఫ్​ 'చలో సీఎంవో' పిలుపు.. అనుమతి లేదన్న బెజవాడ సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.