మోపాడు జలాశయం సమీపంలోని తొట్టి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన మేకలు కాపారులు వీఆర్వోకు సమాచారం అందించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల గ్రామంలో జరిగింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు పామూరు ఎస్సై అంబటి చంద్రశేఖర్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తిపట్టలేని విధంగా ఉందని ఎస్సై తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
![unknown person died in mopadu reservoir at prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7589606_381_7589606_1591979850711.png)
ఇదీ చదవండి :