ETV Bharat / state

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Two men death in a road accident in prakasam district
వేర్వేరు ప్రమాదాలోల్లో ముగ్గురు మృతి
author img

By

Published : May 28, 2020, 7:57 AM IST

ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ చెరుకూరి హనుమంతురావు, అతని సోదరుడు శ్రీనివాసరావు.. ప్రమాదంలో మరణించారు. చిన్నగంజాంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీను.. పెద్దకర్మకు వెళ్ళి తిరుగు పయనంలో ఉన్న వారు.. ప్రమాదానికి గురయ్యారు.

కారంచేడు మండలం దగ్గుబాడు సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్.. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హనుమంతురావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోన్ చేసి ఇంటికి వస్తున్నామని... అంతలోనే ఈ విషాదం జరిగిందని బోరున విలపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కారంచేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరో ప్రమాదంలో...

పర్చూరు మండలం అడుసుమిల్లి వద్ద ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యారు. అడుసుమిల్లి నుంచి పర్చూరుకు వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వెనక వస్తున్న ద్విచక్రవాహనం ఆటోను ఢీ కొట్టిడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆటోలో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

మామిడి కాయలు కోసేందుకు చెట్టెక్కిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం వీర్లంకపల్లిలో జరిగింది. పశ్చిమ గొనగూడెం గ్రామానికి చెందిన గంగరాజు.. వీర్లంకపల్లిలో ఉన్న ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు.

ఎప్పటిలాగే బుధవారం పనికి వచ్చిన గంగరాజు బట్టీలో ఉన్న మామిడి చెట్టు ఎక్కి ఇనుప కమ్మీతో కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్ తీగలకి కమ్మీ తగిలింది. వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అన్నమయ్య భవనంలో నేడు తితిదే మండలి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.