ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులతో పాటు శానిటేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మేదరమెట్ల గ్రామాన్ని పూర్తి లాక్ డౌన్ చేశారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని బస్ వద్ద టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయంచుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి కరోనా నా...అయితే మాకేంటి భయం..!