ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. మృతులను కంభంకు చెందిన రాంప్రసాద్, జాషువాగా పోలీసులు గుర్తించారు. కంభం నుంచి మార్కాపురం మండలం దరిమడుగు వెళుతుండగా కోమటికుంట వద్ద టిప్పర్ను అధిగమించే క్రమంలో.. సిమెంట్ లారీ కిందపడిపోయారు. ద్విచక్ర వాహనం మధ్యలో కూర్చున్న ఓ యువకుడు వాహనం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఓ వివాహ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుమారుడు కృష్ణచైతన్య ఘటనాస్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇదీ చదవండి:తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన కుమారుడు