ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం దుగ్గిరెడ్డిపాలెంలో విషాదం జరిగింది. నీటికుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఆకుల మణికంఠ, బాల మణికంఠ వారి తల్లిదండ్రులతో కలిసి పొలం వెళ్లారు. అమ్మానాన్న పని చేసుకుంటుండగా వీరిద్దరూ ఆడుకుంటున్నారు.
ఆటల్లో దుస్తులకు మట్టి అంటుకోవటంతో కడుక్కోవడం కోసం పొలంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయి మరణించారు. వీరి మరణంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: